సెలవు నియమాలు
సంపాదిత లేక ఆర్జిత సెలవులు (EARNED LEAVES)
ఈ సెలవుకు సంబంధించిన నిబంధనలు
ఈ సెలవుకు సంబంధించిన నిబంధనలు క్రింది ఉత్తర్వుల ద్వారా జారీచేయబడ్డాయి.
G.O.Ms. No. 34, Fin. Dt: 27-1-1979
- సర్వీసుల యందు పనిచేయుచున్న ఉద్యోగులకు డ్యూటీ కాలానికి ప్రతి ఆరు నెలలకు, అనగా సంవత్సరంలో జనవరి నెల ఒకటవ తేదీ నాటికి 15 రోజులు చొప్పున, అదేవిధంగా జులై ఒకటవ తేదీన 15 రోజులు అడ్వాన్స్‌గా జమ చేయబడతాయి.
- ఉపాధ్యాయులకు సంవత్సరానికి 6 చొప్పున సంపాదిత సెలవులు జమచేయబడతాయి.
- జనవరి నెల ఒకటవ తేదీ నాటికి 3 రోజులు చొప్పున, అదేవిధంగా జులై ఒకటవ తేదీన 3 రోజులు అడ్వాన్స్‌గా జమ చేయబడతాయి. G.O.Ms. No. 317, Fin తేది: 15-09-1994
- రెగ్యులర్ కాని తాత్కాలిక ఉద్యోగులకు సగం రోజులకు మాత్రమే అర్హత కలిగి ఉంటారు.
- ఈ సెలవులు 300 రోజులకు మించి నిల్వ ఉండవు. రిటైరైనప్పుడు 300 రోజులకు మించకుండా నగదు చెల్లిస్తారు.
G.O.Ms.No.232 Dt: 16.9.2005
వేసవిలో సంపాదిత సెలవులు
పాఠశాలలకు వేసవి సెలవుల తరువాత ఉపాధ్యాయుల సేవలను వివిధ ప్రభుత్వ కార్యకలాపాలకు వినియోగించుకునే సందర్భంలో మంజూరుచేసే సెలవులను “సంపాదిత సెలవులు” అందురు.
15 రోజులకు మించిన విరామం గల ఉద్యోగులకు ఫండమెంటల్ రూల్ 82(b) ప్రకారం ఇటువంటి సెలవులు మంజూరు చేస్తారు.
వెకేషన్ కాలంలో ఉపాధ్యాయులు ఎన్నికలు, జనాభా గణన, జనాభా ఓట్ల జాబితా తయారీ, పరీక్షలు మొదలగు విధులు నిర్వర్తించినప్పుడు నియామక అధికారి ధృవపత్రం ఆధారంగా సెలవులు మంజూరు చేస్తారు.
G.O.Ms.No.35 Dt: 16-1-1981
G.O.Ms.No.151 Dt: 14-11-2000
G.O.Ms.No.174 Dt: 19-12-2000
వెకేషన్ కాలంలో ఎన్ని రోజులు పనిచేస్తే ఆ రోజులకు దామాషా పద్ధతిలో మాత్రమే సెలవులు మంజూరు చేస్తారు.
G.O.Ms.No.114 Dt: 28-4-2005
సంబంధిత శాఖాధికారి ఉత్తర్వుల ఆధారంగా ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు మండల విద్యాధికారులు, ఉన్నత పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు ప్రధానోపాధ్యాయులు ఇట్టి సెలవులు మంజూరు చేసి సర్వీసు పుస్తకములో నమోదు చేస్తారు.
Rc.No.362 Dt: 16-11-2013
వేసవి సెలవులు 49 రోజులు ప్రకటించిన సందర్భంలో సంపాదిత సెలవులు మంజూరు చేయు విధానం
సంపాదిత సెలవుల లెక్కింపు
పనిచేసిన రోజుల సంఖ్యను నమోదు చేయండి. దానికి అనుగుణంగా వచ్చే సంపాదిత సెలవుల రోజులు చూపబడతాయి.
పనిచేసిన రోజులు – సంపాదిత సెలవులు
| పనిచేసిన రోజులు | సంపాదిత సెలవులు | పనిచేసిన రోజులు | సంపాదిత సెలవులు |
|---|---|---|---|
| 1 | 1 | 25 | 14 |
| 2 | 1 | 26 | 15 |
| 3 | 2 | 27 | 15 |
| 4 | 2 | 28 | 16 |
| 5 | 3 | 29 | 16 |
| 6 | 3 | 30 | 17 |
| 7 | 4 | 31 | 17 |
| 8 | 5 | 32 | 18 |
| 9 | 5 | 33 | 18 |
| 10 | 6 | 34 | 19 |
| 11 | 6 | 35 | 19 |
| 12 | 7 | 36 | 20 |
| 13 | 7 | 37 | 21 |
| 14 | 8 | 38 | 21 |
| 15 | 8 | 39 | 22 |
| 16 | 9 | 40 | 22 |
| 17 | 10 | 41 | 23 |
| 18 | 10 | 42 | 23 |
| 19 | 11 | 43–49 | 24 రోజులు |
| 20 | 11 | ||
| 21 | 12 | ||
| 22 | 12 | ||
| 23 | 13 | ||
| 24 | 13 |
Related GOs & Proc
- G.O.Ms.No.34 dt: 27.01.1979 – సెలవు నిబంధనల సరళీకరణ సవరణ
- G.O.Ms.No.232 dt: 16.9.2005 – ఆర్జిత సెలవుల నిల్వ మరియు పదవీ విరమణ సమయంలో సెలవు నగదు చెల్లింపు (ఎన్‌క్యాష్‌మెంట్) గరిష్ట పరిమితిని 240 రోజుల నుండి 300 రోజులకు పెంపుదల
- G.O.Ms.No.35 dt: 16.1.1981 – సెలవుల పరిరక్షణ – వేసవి సెలవులలో జనాభా గణన మొదలగు విధుల నిమిత్తం ఉపాధ్యాయుల సేవల వినియోగం
- G.O.Ms.No.151 dt: 14.11.2000 – సెలవుల పరిరక్షణ – వేసవి సెలవులలో జనాభా గణన మొదలగు విధుల నిమిత్తం ఉపాధ్యాయుల సేవల వినియోగం
- G.O.Ms.No.114 dt: 28.4.2005 – ఆంధ్రప్రదేశ్ ఫండమెంటల్ రూల్స్‌లోని రూల్ 82 సవరణ – దామాషా పద్ధతి
- Rc.362 dt: 16.11.2013 – వేసవి సెలవులలో ఎన్నికల విధులు / జనాభా గణన / శిక్షణ మొదలగు కార్యక్రమాల నిమిత్తం ఉపాధ్యాయ సిబ్బంది నియామకం